తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాటి కాలంలో కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ కూడా చేసారు కృష్ణంరాజు. తన సుధీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సంచలన సినిమాలు చేసారు ఈయన. యంగ్ ఏజ్‌లో ఉన్నపుడు ఈయన ఎంత స్మార్ట్‌గా ఉండేవాళ్ళో అభిమానులు చెప్తుంటారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

 కాగా ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా తనకు నచ్చిన సినిమాల గూర్చి ప్రస్తావిస్తూ, నేను అన్ని సినిమాలు చాలా మంచి సినిమాలే, అందులో 'మనవూరి పాండవులు, 'కటకటాల రుద్రయ్య' నాకు ఎప్పటికి గుర్తుండి పోయే గొప్ప సినిమాలు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ఇక ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న పభాస్ అన్ని భాషల అభిమానులు కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఈ సమయంలో సినిమా గురించి కృష్ణం రాజు ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెళ్లడించాడు.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని వాటిపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. కాని మొదటి సారి కృష్ణం రాజు వాటిపై క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలో కీలక పాత్రను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ పాత్ర కోసం తాను గడ్డం కూడా పెంచానంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్ త్వరలో పూర్తి చేస్తాం అని తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, నాకు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. పాటలు కూడా పూర్తి అయ్యాయి. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని కృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు పరమహంస అనే ఒక మహా జ్ఞాని పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: