ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాగ సౌర్య మంచి మంచి సినిమాలు చేసుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.."ఊహలు గుస గుస లాడే" సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.జనవరి 22వ తేదిన టాలీవుడ్ యంగ్ హీరో  నాగశౌర్య బర్త్. ఆ సందర్బంగా  డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ థమాకా ఇచ్చాడు. తను యాక్ట్ చేస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ ని రిలీజ్ చేశాడు. వరుడు కావలెను సినిమా యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే, లక్ష్య సినిమా నుంచి చిన్న టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నాగశౌర్య కనిపించబోతున్నాడు.

 నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు అత్యధిక లైక్స్ తో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. జగపతి బాబు వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ లో ఆకట్టుకున్న విషయాలు మనం గమనించినట్లయితే..చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఒక్కడు పుడతాడు. వాడి వల్ల ఆటకే గుర్తింపు వస్తుంది అనే డైలాగ్స్, అలాగే పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం అంటూ లాస్ట్ లో చెప్పే డైలాగ్స్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దెబ్బతిన్న పులిగా ఆవేశంగా లాస్ట్ లో పంతంతో పందెం గెలిచేలా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు నాగశౌర్య.

 చాలా రఫ్ లుక్ లో తన సిక్స్ ప్యాక్ షాట్ ని రివీల్ చేశారు. హ్యాపీ బర్త్ డే నాగశౌర్య అంటూ సినిమా ఎలా ఉండబోతోందో చిన్న టీజర్ లోనే చూపించేశారు.అంతేకాదు, నాగశౌర్య కి కోపం ఎక్కువగా ఉన్నట్లు, అందుకే ఆటకి దూరమైనట్లుగా కూడా సీన్స్ కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సినీ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీరేంద్ర సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాలభైరవ మ్యూజిక్ ని అందిస్తున్నాడు...ఈ సినిమాతో నాగ సౌర్య ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేటట్లు కనిపిస్తున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: