పవన్ కల్యాణ్‌కు అదే విధంగా కొన్ని అభిరుచులు ఉన్నాయి. పవన్ కల్యాణ్‌కు అరటి కాయ వేపుడు అంటే ప్రాణం అంట. తన ముందు అరటి కాయ వేపుడు ఉంటే తినకుండా అస్సలు ఉండలేరట. అరటి కాయ వేపుడు కావాలా చికెన్, మటన్ బార్యానీ కావాలా అని అడిగితే తనకు అరటి కాయ వేపుడే కావాలనేంత ఇష్టమని చెబుతున్నారు. షూటింగ్ సమయాల్లో కూడా పవన్ కల్యాణ్ ఎక్కువగా అరటి కాయ వేపుడే తింటారని తెలుస్తోంది. సన్నగా, నిలువుగా కోసిన అరటి కాయ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి దోరగా వేయించి ఆయన ముందు పెడితే నిమిషాల్లో లాగించేస్తారట.
పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో మొదటి స్థానం అరటి కాయ వేపుడుదే అని చెబుతున్నారు. తన తల్లి, వదిన సురేఖ పవన్ కల్యాణ్‌కు ఎప్పటికప్పుడు ఆయనకు ఇష్టమైన వంటకాన్ని చేసి పెడుతూనే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. పవన్ కల్యాణ్ సినిమాలకు దూరమై మూడేళ్లు గడిచింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఒకపక్క వరుస సినిమాలతో, మరోపక్క రాజకీయ సమస్యలను పోరాడుతూ నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి