ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. సరిగ్గా రెండేళ్ల క్రితం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా అన్ని భాషల్లో కూడా భారీ సక్సెస్ అందుకుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించారు. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్ 2, మొదటి భాగాన్ని మించేలా మరింత భారీగా నిర్మితం అవుతోంది.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి యూట్యూబ్ లో ఊహించని విధంగా అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో రెండవ భాగం పై అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ చాప్టర్ 2 సినిమాని భారీ ఎత్తున కొన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతున్నట్లు టాక్. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా యొక్క థియేట్రికల్ హక్కుల కోసం అన్ని భాషల నుండి పలువురు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా ఎగబడుతున్నారట.

వాస్తవానికి దీని రైట్స్ అన్ని భాషల్లో కూడా ఎంతో భారీ రేట్స్ పలుకుతున్నప్పకీ కూడా బయ్యర్స్ నుండి ఊహించని విధంగా స్పందన వస్తోందని, బాబ్బాబు మాకివ్వండి, మాకివ్వండి అంటూ వారు ఎంతో పోటీ పడుతున్నారట. అయితే సినిమా మీద అందరికీ నమ్మకం ఉండడంతోనే ఈ స్థాయి రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్ తదితర దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా మే నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీని థియేట్రికల్ ట్రైలర్ ఉగాది కానుకగా రిలీజ్ అవుతుందని, అతి త్వరలో ఈ మూవీ కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: