తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండడం అలానే మహేష్ అభిమాని అయిన పరశురామ్ తొలిసారిగా ఆయన మూవీ కి పనిచేస్తుండటం వీటితో పాటు మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో కూడా మహేష్ ఫస్ట్ టైం జతకడుతుండడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క షూటింగ్ నుండి లీక్ అయిన ఫోటోలు మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచాయని చెప్పాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకు ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 20వ తేదీతో పూర్తవుతుందని అలాగే ఆ మరుసటి రోజు అనగా 21వ తేదీన ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని యూనిట్ రిలీజ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. మరి ఇదే గనుక నిజమైతే ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి