ఇతని సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో 'డిటెక్టివ్' 'అభిమన్యుడు' 'పందెం కోడి2' వంటి చిత్రాలతో హిట్లు కొట్టిన విశాల్ ఆ తరువాత 'అయోగ్య' 'యాక్షన్' వంటి చిత్రాలతో కాస్త డల్ అయ్యాడు. అయినప్పటికీ విశాల్ నటించిన తాజా చిత్రం 'చక్ర' పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.ఎం.ఎస్.ఆనందన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. 'జెర్సీ' బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది.
ఇక ఈ సినిమా రెండు రోజుల వసూళ్ల విషయానికి వస్తే...'చక్ర' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.84 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.56 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. కానీ పర్వాలేదు అనిపించింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి