ప్రభాస్‌కు హిందీలో క్రేజ్‌ బాహుబలితో వచ్చింది. సాహో తెలుగులో ఫ్లాప్‌ అయినా.. హిందీలో 100 కోట్లు కలెక్ట్‌ చేసి అక్కడ బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఇదేమిటో  తెలుగువాళ్లకే కాదు.. బాలీవుడ్‌కు అంతుపట్టలేదు. మూడో పాన్‌ ఇండియా మూవీ రాధే శ్యామ్‌ రిలీజ్‌ కాకుండానే.. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఔం రౌత్‌ ప్రభాస్‌తో 'ఆదిపురుష్‌' ప్లాన్‌ చేశాడు. మరోవైపు కెజిఎఫ్‌తో  పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ నీల్‌  ప్రభాస్‌తో 'సలార్‌' మొదలుపెట్టేశాడు. ఇక నాగ అశ్విన్‌ అయితే.. ప్రభాస్‌తో పాన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ప్లాన్‌ చేశాడు.

చేతిలో నాలుగు పాన్‌ ఇండియా మూవీస్‌ వున్నా.. ప్రభాస్‌ను బాలీవుడ్ వదిలిపెట్టడం లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ డార్లింగ్‌ డేట్స్‌ కోసం వెయిట్ చేస్తోంది. ధూమ్ 4ను ప్రభాస్‌తో తీద్దామనుకుంటే.. కుదర్లేదట. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ మొదలై 50 ఏళ్లయిన సందర్భంగా. ..  ప్రభాస్‌తో మూవీ చేయాలన్న పట్టుదలతో ఉంది.

ముందు అదిరిపోయే కథతో ప్రభాస్‌ను పడేయాలని యశ్‌ రాజ్‌ ఫిలింస్‌  నిర్ణయించుకుంది.  ఇందుకోసం ఆస్థాన దర్శకుడు దర్శకుడు మనీష్ శర్మ కథ రెడీ చేసే పని అప్పగించిందట.  'బ్యాండ్ బాజా బారాత్- శుధ్ దేశీ రొమాన్స్ వంటి హిట్‌ మూవీస్‌ తీసిన మనీష్‌తో ప్రభాస్‌ మూవీ ఉంటుందనేది బీటౌన్‌ టాక్‌. ప్రభాస్‌ లైనప్‌ చూసి ఖాన్‌ త్రయం ఖంగుతింటోంది. షారూక్‌.. అమీర్‌ చెరో మూవీ చేస్తున్నారు.  

రాను రాను ఖాన్‌ త్రయంకు క్రేజ్‌ తగ్గింది. వీళ్ల సినిమా ఫ్లాప్‌ అయితే.. 100 కోట్లు కలెక్ట్‌ చేయడం కూడా కష్టంగా వుంది.  హిందీలో తప్ప సౌత్‌లో మార్కెట్‌ లేదు. అదే ప్రభాస్‌ అయితే.. తెలుగులో 100 కోట్లు.. హిందీలో 100 కోట్లు.. మిగతా అన్ని చోట్లా కలిసి మరో  100 కోట్లు వస్తుందన్న నమ్మకం వుంది. దీంతో.. ఖాన్‌ త్రయం కంటే.. డార్లింగే బెటర్‌ అన్న నమ్మకంతో ఉన్నాయి బాలీవుడ్‌ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: