తొలిసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి బాలనటుడిగా బాల రామాయణం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాముడిగా ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కింది. ఆ తరువాత తొలిసారిగా హీరోగా నిన్ను చూడాలని మూవీ ద్వారా పరిచయమైన ఎన్టీఆర్, ఆపై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో సూపర్ హిట్ అందుకుని నటుడిగా బాగా పేరు సంపాదించారు. ఇక అక్కడి నుండి వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.

ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, ఇందులో కొమరం భీం పాత్ర చేస్తున్నారు. ఇక దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న మూవీలో నటించనున్న ఎన్టీఆర్, అందులో ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్లు టాక్. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. 

దాని ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని, సినిమాని కీలకమైన మలుపు తిప్పే ఈ పాత్ర కి కళ్యాణ్ రామ్ అయితేనే కరెక్ట్ అని భావించిన త్రివిక్రమ్, ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన కల్యాణ రామ్ ని ఆ పాత్ర చేయమని కోరగా ఆయన చేయడానికి అంగీకరించారని అంటున్నారు. నిజానికి నందమూరి ఫ్యాన్స్ ఈ ఇద్దరు అన్నదమ్ములను ఒకే తెరపై చూడాలని ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా వారికీ పెద్ద పండుగ న్యూస్ అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: