తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా హీరోల ను అభిమానులు ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.   ఒక్కసారి హీరోలను అభిమానించడం మొదలు పెట్టారు అంటే ఏక వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు అభిమానులు చూపించే ప్రేమ ఏకంగా అభిమానుల ప్రాణాల మీదికి కూడా తెచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక తమ అభిమాన హీరో కి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎలాగైనా తమ అభిమాన హీరో ని కలవాలి అని భావించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ అభిమానులు.



 అయితే కొన్ని కొన్ని సార్లు అభిమానులు ఎంతో ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురవుతుంది. కొన్నిసార్లు మాత్రం హీరోలు తమ అభిమానులను కలిసి ఫోటోలు దిగి వారిని సంతోష పరుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఒక అభిమాని ఏకంగా తన అభిమాన హీరోని కలిసేందుకు ప్రాణాలకు తెగించి మరీ నదిలో దూకేసాడు. దీంతో ఆ హీరో సైతం ఒక్కసారిగా షాక్ అయ్యాడు అనే చెప్పాలి. అయితే ఆ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య.  అక్కినేని నాగచైతన్య ను కలిసేందుకు..  దగ్గరగా చూసేందుకు ఓ అభిమాని ఏకంగా నదిలో దూకేశాడు.



 తూర్పు గోదావరి జిల్లాలోని ఒక నదిలో నాగచైతన్య షూటింగ్ లో ఉన్న సమయంలో ఇక అక్కడికి నాగచైతన్య ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే ఇక నది లో షూటింగ్ జరుగుతూ ఉండగా నదిపై ఉన్న ఒక బ్రిడ్జి పై అభిమానులు ఉండగా అందులో ఒక అభిమాని నాగచైతన్యను మరింత దగ్గరగా చూసేందుకు ఏకంగా నదిలో దూకేశాడు. దీంతో నాగచైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే షూటింగ్ తర్వాత ఆ అభిమాని ని కలిసి ఫోటో దిగిన నాగచైతన్య ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: