తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా హిందూపురం టౌన్‌లో ఆయన ఓటు వేశారు. కొద్దిరోజులుగా ఆయన హిందూపురంలోనే ఉంటున్నారు. పార్టీ తరఫున మున్సిపాలిటీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి వార్డులోనూ పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.ఈ ఉదయం ఆయన భార్య వసుంధరతో కలిసి స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఓటర్లు బారులు తీరి నిల్చుని కనిపించారు. దీనితో ఆయన వారితో పాటు క్యూ లైన్‌లో నిల్చున్నారు.
పోలింగ్ సిబ్బంది, స్థానిక పోలీసులు.. ఆయనకు ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ప్రజలతో పాటు తానూ క్యూ లైన్‌లోనే ఉంటానని సున్నితంగా తిరస్కరించారు. తన వంతు వచ్చేంత వరకూ భార్యతో కలిసి క్యూలైన్‌లో నిల్చున్నారు. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు..ఇక బాలయ్య సినిమా విషయానికొస్తే..బోయపాటి శీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు.. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను మే 28 న విడుదల చేయనున్నారు.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి