ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన హీరో రామ్ అదే జోష్ తో తాజాగా రెడ్ సినిమాను చేసిన విషయం తెలిసిందే... అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయింది. కానీ హీరో రామ్ మాత్రం ఈ చిత్రంలో తన ప్రతిభను కనబరిచారు. కాగా ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ హీరో..... ఇప్పుడు మళ్లీ ఫుల్ స్పీడ్ తో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సారి అందాల రాకుమారుడు రామ్ తన మార్కెట్ ను మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆధ్వర్యంలో హీరో రామ్ ఓ సినిమా చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయడానికి ఓకే చెప్పిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు..వైజయంతీ మూవీస్ సంస్థతో ఓ సినిమా కోసం హీరోగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనుదీప్ దర్శకత్వంలో అశ్వినీదత్, ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్‌లు సినిమాను నిర్మించబోతున్నారట. ఈ న్యూస్ వింటుంటే... హీరో రామ్ నిజంగానే తన మార్కెట్ ను భారీగా పెంచేందుకు బాగానే ప్లాన్ చేసాడు అన్న విషయం అర్థమవుతుంది. మరి చూద్దాము ఇది ఎంతమేరకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో...!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి