ఇక ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఏకంగా 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.
తాజాగా ఈయన డబ్బింగ్ స్టూడియోకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ, తమిళంలో పింక్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళనాట అజిత్ నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి వస్తుంది పింక్. ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం రెండు హైలైట్ అంశాలను దాచేసారు దర్శక నిర్మాతలు. వాటిని ఇప్పటి వరకు బయట చెప్పలేదు. నేరుగా థియేటర్‌లోనే చూపిస్తూ థ్రిల్ ఫీల్ అవుతారని భావిస్తున్నారు యూనిట్.
ఇక పింక్, నెర్కొండ పార్వై సినిమాల్లో లేని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు వకీల్ సాబ్‌లో ఉన్నాయి. ఒరిజినల్‌లో లేని సన్నివేశాలను కూడా పవన్ ఇమేజ్ కోసం ఇక్కడ యాడ్ చేసారు. పింక్ స్క్రిప్టులో వేణు శ్రీరామ్ భారీగానే మార్పులు చేసాడు. తెలుగు ప్రేక్షకుల కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. ఎప్రిల్ 9న వకీల్ సాబ్ చూసిన తర్వాత అభిమానులు తన కష్టాన్ని గుర్తిస్తారని నమ్మకంగా చెప్తున్నాడు శ్రీరామ్ వేణు. ఆ రెండు యాక్షన్ సీక్వెన్సులు కూడా సినిమాకు హైలైట్ అవుతాయని చిత్రయూనిట్ బలంగా నమ్ముతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి