సరిగ్గా ఏడాది క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అంతకు ముందు కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొని సరైన సక్సెస్ లేక సతమతం అయిన అల్లు అర్జున్ కి ఆ మూవీ సక్సెస్ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అలానే ఆ మూవీకి తమన్ అందించిన సాంగ్స్ జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాయి. ఇక దాని తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పుష్ప రాజ్ అనే మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 13న విడుదల చేయబోతున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కావటం అలానే అలవైకుంఠపురములో తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థల పై రూపొందనున్న భారీ మూవీలో అల్లు అర్జున్ నటించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని దానిని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. అయితే దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి ప్రశాంత్ నీల్ కి అల్లు అరవింద్ కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారని భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆ మూవీ రూపొందనుందని చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ నిర్మించనున్నారని ప్రస్తుతం మహేష్ తో కలిసి ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. టాలీవుడ్ కి చెందిన ఒక బడా దర్శకుడు దానిని తీయనున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తుండగా అది పూర్తయిన అనంతరం త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ మూవీ ని ఆయన చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే దీనిపై పూర్తి నిజాలు వెల్లడి కావాలి అంటే అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: