మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి..కానీ హీరో కొడితే మాత్రం పడిపోవాలి.. ఇది తెలుగు సినిమాల్లో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం.. ఇదివరకు ప్రతినాయక పాత్రలకు స్పెషల్ గా కొంతమందిని ఎంపిక చేసుకుని వారినే కొనసాగించేవారు కాని ఇప్పుడు అలా కాదు, కథ నచ్చితే స్టార్ హీరో అయినా విలన్ గా కనిపించడానికి వెనుకాడట్లేదు.. అందుకోసం కొంత ప్రత్యేకంగా బాడీ పై దృష్టి పెడితే సరిపోతుంది.

రాజమౌళి సినిమాలో విలన్ అంటే మామూలు విషయం కాదు..అయన సినిమాల్లో హీరో ఎంత సింపుల్ గా ఉన్నా పర్వాలేదు కానీ విలన్ మాత్రం క్రూరంగా ఉంటాడు.. హీరో క్యారక్టర్ కంటే విలన్ క్యారక్టర్ ని చాలా బాగా డిజైన్ చేస్తాడు రాజమౌళి.. అలా అయన ఇండస్ట్రీ కి తీసుకువచ్చిన విలన్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం..

ప్రదీప్ రావత్..బాలీవుడ్ కిచెందిన ఈ విలన్ ని నితిన్ సై సినిమా తో టాలీవుడ్ కి పరిచయం చేశాడు.. ఆ సినిమాలో ఆయన్ని చూస్తేనే భయం కలిగించేలా ఉండే నటనని చూపించాడు రాజమౌళి. ప్రస్తుతం తెలుగులో టాప్ విలన్ అంటే ఈయనే అని చెప్పాలి.దేవ్ గిల్... మగధీర చిత్రంలో  విలన్ గా చేసిన దేవ్ గిల్  ర‌ణ‌దేవ్ బిల్లా గా తనలోని క్రూరత్వమంతా చుపించాడు.. ఈక్రెడిట్ రాజమౌళి కే ఇవ్వాలి. కన్నడ లో సూపర్ స్టార్ హీరోగా ఉన్న సుదీప్ ని విలన్ చేసిన ఘనత రాజమౌళి దే.టాలీవుడ్ లో నాని హీరో గావచ్చిన ఈగ సినిమాలో సుదీప్ పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ లో విలన్ ఉన్నాడని గుర్తించాడు రాజమౌళి. విక్రమార్కుడు లో విలన్ గా చేసి  మెప్పించాడు. ఇక రాజమౌళి నుంచి విలన్ గా వచ్చిన నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్ ఇప్పుడు మంచి సినిమాలలో విలన్ వేషాలు వేస్తున్నారు. రానాని భల్లాలదేవ గా చూపించి రాజమౌళి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: