పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది. దిల్ రాజు, బోనికపూర్ కలిసి తొలిసారిగా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు.

ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, అంజలి, నివేదాథామస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో సత్య దేవ్ అనే పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా నటించగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటించింది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ వకీల్ సాబ్ మూవీని మన తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మూడేళ్ల తర్వాత తమ పవర్ స్టార్ నుండి వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ ని అందుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తమన్ ని పొగుడుతూ పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో ఆనందంగా కామెంట్ చేస్తున్నారు. అయితే వారి కామెంట్స్ పై ఇటీవల స్పందించిన తమన్ తదుపరి పవన్, రానా కలిసి చేస్తున్న అయ్యప్పనుం కోషియం మూవీ రీమేక్ కూడా మరింతగా అదిరిపోతుందని అలానే దాని సాంగ్స్, బీజీఎమ్ మరొకరు స్థాయిలో ఉంటాయని, ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు సాగర్ దీనిని ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తప్పకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరొక పండుగ ఖాయం అని అన్నారు. దానితో పవన్ ఫ్యాన్స్ లో మరింత ఆనందం వెల్లివిరుస్తుంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: