టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా ఆడియన్స్ లో గొప్ప పేరు సంపాదించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట మాటలు, కథారచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించిన త్రివిక్రం పలు సినిమాల ద్వారా మంచి విజయాలు అందుకొన్నారు. ఆ పై నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు త్రివిక్రమ్. తరుణ్, శ్రియ ల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని త్రివిక్రమ్ కి బాగా పేరు తెచ్చి పెట్టింది. అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో అతడు అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన త్రివిక్రమ్ అక్కడి నుండి వరుసగా సినిమాలతో కొనసాగారు.

ఇక తన కెరీర్ లో త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అలానే అల్లుఅర్జున్ తో ఇటీవల అలవైకుంఠపురములో వంటివి అతిపెద్ద విజయవంతమైన సినిమాతో పాటు ఏడాదిన్నర క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా అందుకున్నారు. వీటితో పాటు త్రివిక్రమ్ కెరీర్ పరంగా కొన్ని పరాజయాలు కూడా చవిచూశారు. ఇక అసలు విషయం ఏమిటంటే అతి త్వరలో మరొక సారి మహేష్ బాబు తో ఒక సినిమాతో పాటు ఆపై జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్ లతో మాత్రం ఒక్క సినిమా కూడా ఆయన చేయలేదు.

నిజానికి గతంలో ఒకానొక సందర్భంలో ప్రభాస్ తో త్రివిక్రమ్సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్లనే అది కథా చర్చల అనంతరం ఆగిపోయిందని ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయనతో ఇప్పటివరకు త్రివిక్రం ఒక్క సారి కూడా మూవీ స్టోరీ డిస్కషన్ చేలేదని కాగా రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు బడా స్టార్లతో కూడా త్రివిక్రమ్ సినిమాలు చేస్తారని అంటున్నారు. మరోవైపు పలువురు ప్రభాస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంతకీ మా ఇద్దరి హీరోలతో సినిమాలు ఎప్పుడు చేస్తారు గురూజీ అంటూ త్రివిక్రమ్ ను ఉద్దేశించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: