కరోనా మహమ్మారి వల్ల  గత ఏడాది ఎప్పుడో రావాల్సిన సినిమాలు ఇప్పటికి కూడా విడుదలకు నోచుకోలేదు..అయితే ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ కోలుకుంటోంది..అనే సమయంలో మళ్ళీ ఇండ్రస్టీ కి గట్టి దెబ్బే పడేలా ఉంది.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల రిలీజ్ డేట్ విషయాల్లో ఎవరు ఊహించని విధంగా మళ్ళీ మార్పులు జరగబోతున్నాయి. ఇండస్ట్రీలో మరోసారి పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు కూర్చొని మాట్లాడుకునే సమయం వచ్చింది.కరోనా తగ్గిందని అనుకోని ఈ ఏడాది దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు కరోనా వల్ల ఒక్కొక్కరు మళ్ళీ డేట్స్ చేంజ్ చేసుకోక తప్పడం లేదు. అయితే పుష్ప విషయంలో మాత్రం అలాంటి మార్పులు ఉండకపోవచ్చని టాక్ వస్తోంది. దర్శకుడు సుకుమార్ షూటింగ్ ను పక్కా ప్లాన్ తో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.కోవిడ్ ప్రభావం ఎక్కువగా పడకుండా తక్కువమంది యూనిట్ సభ్యులతో షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఆగస్ట్ 13న సినిమాను పూర్తి చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

 అయితే ఆ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని సుకుమార్ డేరింగ్ గా వెళుతున్నట్లు సమాచారం. ఎందుకంటే మళ్ళీ ఆ డేట్ మిస్సయితే మరో డేట్ దొరకదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి పోటి ఎక్కువగా లేని సమయంలోనే రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు..అయితే ఇండ్రస్టీ లోని మిగతా మేకర్స్ మాత్రం వెనకడుగు వేస్తుంటే.. సుకుమార్ మాత్రం ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..ఇక ఇప్పటికే పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. తాజగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప రాజ్ ఇంట్రో టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది..స్సోషల్ మీడియాలో ఈ టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్ లో నడుస్తోంది..ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: