ఛలో, భీష్మ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అసోసియేట్ డైరెక్టర్ గా వెంకీ పని చేయనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ యంగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసే ఛాన్స్ పోగొట్టుకోకూడదనే ఎగ్జైట్‌మెంట్ లో వెంటనే ఒకే చెప్పి ఉంటారేమో కానీ ఈ నిర్ణయం ఆయన సినిమా కెరీర్ ని తుంగలో తొక్కుతోందా అనే ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో తలెత్తుతోంది. ఎందుకంటే వెంకీ కుడుముల ఆల్రెడీ రెండు సినిమాలు తీసి మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మళ్లీ ఆయన డైరెక్షన్ లో ఓనమాలు నేర్చుకునే దిశగా వెళ్తుండటం తో.. స్టార్ హీరోలు ఒక అసోసియేట్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఒప్పుకుంటారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

నిజానికి కేవలం రెండే రెండు సినిమాలు చేసిన వెంకీ కి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడమే గగనం.. అలాంటిది ఆయన ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ గా మారుతుండటం తో స్టార్ హీరోలతో చేసే అవకాశాలు బాగా సన్నగిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. రెండు వరుస హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న వెంకీ కీలక సమయంలో తప్పు చేయబోతున్నారా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.

ఇకపోతే 10 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబో రిపీట్ అవుతోంది. వీళ్లిద్దరూ కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. అయితే ప్రేక్షకుల్లో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: