ఏంటి ఒకపక్క కరోనాతో ప్రజలు అస్త వ్యస్థలు పడుతుంటే సినిమాల గోల అనుకుంటున్నారా. !కాస్త ఆగండి అసలు విషయం తెలిస్తే మీరే షాక్ అవుతారు. సల్మాన్ ఖాన్ మంచి మనసుకు హ్యాట్సఫ్ అంటారు. ఇంతకీ విషయం ఏంటంటే సల్మాన్ నటిస్తున్న సినిమా రాధే.ఈద్ సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో, ఓటీటీపై ఒకేసారి విడుదల కానున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో చిత్ర యూనిట్ ఒక శుభవార్త చెప్పింది.దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తినడానికి తిండి లేక అనాధలుగా అయిపోయారు చాలామంది. ఇక దేశంలో రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం చూస్తూనే ఉన్నాము.అందుకనే రాధే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను.. కరోనాపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని ప్రకటించింది.మొదటి రోజున వచ్చిన కలెక్షన్స్ ను డొనేట్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
సల్మాన్ మూవీ కాబట్టి మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇటు ఓటీటీలో కూడా పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తుండటంతో.. మొదటిరోజు వసూళ్లు పాతిక కోట్లు దాటే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కరోనా బాధితులకు విరాళం అందుతుందని తెలుస్తుంది.సల్మాన్ ఖాన్ తీసుకున్నా ఈ నిర్ణయం వలన ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నాడు మన బాలీవుడ్ కండల వీరుడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సల్మాన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరు అభినందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి