భారత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రం లాక్ డౌన్ విధించింది. నిజానికి ముందు లాక్ డౌన్ విధించం అని చెబుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించాయి. ఈ సెకెండ్ వేవ్ ఉదృతి మరీ దారుణంగా ఉంది. నిన్న మొన్నటి వరకూ బాగానే ఉన్న వారు సైతం సడన్ గా కరోనా కారణముగా చనిపోతున్నారు. అయితే మరీ ముఖ్యంగా
సినిమా ఇండస్ట్రీలో కరోనా తీరని శోకం మిగులుస్తుంది. ఇక ఇప్పటికే కోవిడ్ కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పట్లో మొదలు పెట్టడం కూడా కష్టంగానే కనిపిస్తుంది.
మొన్నటి వరకు కరోనా కేసులు ఉన్నా కూడా షూటింగ్స్‌కు అనుమతులు ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేయగా హీరోలు కూడా బాగానే సహకరించారు. అయితే
లాక్ డౌన్ విధించడంతోనే ఇప్పుడు సమయంలో షూటింగ్స్ మాట ఎత్తడం కూడా తప్పే అంటున్నారు. ఇప్పటికే మన హీరోలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్స్ కు ఇప్పట్లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా సరే కొద్ది రోజుల పాటు షూటింగ్స్ కి ఎవరూ వెళ్ళ కూడదు అని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. నెల రోజుల తర్వాత కానీ పూర్తిగా కోలుకున్నట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మన హీరోలు కూడా షూటింగ్స్ కు ఇప్పట్లో వెళ్లకూడదని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో చూడాలి.