ఇటీవల మంగ్లీ పాడిన “బాయిలోనే బల్లి పల్లకి” అనే పాట విడుదలై సంచలనంగా మారింది. విడుదలైన కొద్ది రోజులలోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇండియాలో వైట్ నంబర్ వన్ ట్రెండింగ్ సాంగ్‌గా నిలవడం మంగ్లీ క్రేజ్‌కు మరో నిదర్శనం. అయితే ఇంతటి విజయాన్ని చూసి కొందరు కావాలనే ఈ పాటను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో “బాయిలోనే బల్లి పల్లకి” పాట మరాఠీ పాటకు కాపీ అంటూ కొన్ని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంలోకి గాయనీ మధుప్రియ పేరును కూడా లాగుతూ, గతంలో ఆమె చేసిన పనులను గుర్తు చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో మధుప్రియ ఒక మరాఠీ పాటపై డాన్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. దాంతో “మంగ్లీ మరాఠి ఒరిజినల్ పాటను కాపీ కొట్టింది” అనే ఆరోపణలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. కొందరు కావాలనే ఒక బ్యాచ్‌గా ఏర్పడి, మంగ్లీకి టాలెంట్ లేదని, కాపీ పాటలతోనే బతుకుతోందని విమర్శలు చేయడం ప్రారంభించారు.
కానీ ఈ ఆరోపణలకు నిజం లేదని త్వరలోనే స్పష్టత వచ్చింది. అసలు ట్విస్ట్ ఏంటంటే…
* ఆ మరాఠీ పాట సింగర్‌నే పరోక్షంగా స్పందిస్తూ, ఆ వీడియోలో ఉన్న పాట మంగ్లీదేనని చెప్పకనే చెప్పేశారు.
* “బాయిలోనే బల్లి పల్లకి” పాట విడుదలైన కొన్ని వారాల తర్వాతే అదే ట్యూన్‌తో మహారాష్ట్రలో ఆ పాటను విడుదల చేశారు.
* అంతేకాదు, ఆ పాట డిస్క్రిప్షన్‌లోనే “మంగ్లీ పాడిన బల్లి బల్లికే మా స్ఫూర్తి” అని స్పష్టంగా రాయడం ఇప్పుడు హైలైట్‌గా మారింది.
దీంతో నిజం ఏమిటో అందరికీ అర్థమైంది. మంగ్లీ పాట ఒరిజినల్ అని, మరాఠీ వెర్షన్ దానినే ఆధారంగా తీసుకుని రూపొందించారన్న విషయం బయటపడింది. అయినప్పటికీ కొందరు కావాలనే మంగ్లీ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ వివాదాన్ని కొనసాగిస్తూ, మధుప్రియ పేరును కూడా అనవసరంగా ఇందులోకి లాగుతున్నారని నెటిజన్లు అంటున్నారు.మొత్తానికి, విజయం చూసి ఓర్వలేక కొంతమంది ఆకతాయిలు చేస్తున్న కుట్రలు ఇవన్నీ అన్నది ఇప్పుడు స్పష్టమైంది. టాలెంట్ ఉన్నవారిపై ఇలాంటి ట్రోల్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ నిజం ఎప్పుడూ నిజంగానే బయటపడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.మంగ్లీ మాత్రం ఎలాంటి వివాదాలకు లొంగకుండా, తన పాటలతోనే సమాధానం చెబుతూ ముందుకు దూసుకుపోతోంది. దీంతో నెటిజన్స్ కొందరు దీని పై రియాక్ట్ అవుతూ..జనాలు ఇలా తయారు అయ్యారు ఏంట్రా ..ఒక మనిషి ఎదుగుతుంటే ఇంకో మనిషి ఓర్వలేడా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి