ఇదే సమయంలో “నేషనల్ క్రష్”గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వార్తలతో పాటు ఆమె కెరీర్‌కు సంబంధించిన అనేక కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందా? లేదా తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంటుందా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. “నేషనల్ క్రష్ సొంతం అయిపోతుంది” అంటూ కొందరు చేసిన కామెంట్లు ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంకా ఎక్కువ హీట్‌గా మార్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్‌గా రష్మిక మందన్న నటించాల్సి ఉందని ప్రచారం జరిగిన ఒక సినిమాలోకి రుక్మిణి వసంత ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద షాక్‌లా మారింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి, రోజుకో కొత్త కోణంలో చర్చకు దారి తీస్తోంది.ఇదే సమయంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన రుక్మిణి వసంతకు మరో క్రేజీ ఆఫర్ దక్కిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఓ భారీ సినిమాలో రుక్మిణి వసంత్ ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్ నటనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఆయన సరసన నటించే అవకాశం ఏ హీరోయిన్‌కైనా కెరీర్‌కు ప్లస్ అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. గతంలో ఈ పాత్రకు మరో బ్యూటీని అనుకున్నారు కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ కీలకమైన స్థానంలోకి రుక్మిణి వసంత్ రావడం మరింత ఆసక్తికరంగా మారింది. శర్వానంద్ లాంటి స్టేబుల్ హీరో సరసన నటిస్తే రుక్మిణి వసంత్ కెరీర్ తప్పకుండా కొత్త మలుపు తిరుగుతుందనే అభిప్రాయం కూడా వినిపించింది. ఇప్పుడు అదే నిజమవుతున్నట్లుగా ఈ ఆఫర్ కనిపిస్తుండటంతో, ఆమె ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
దీంతో సోషల్ మీడియాలో “ఇదే నిజమైన విన్నింగ్ అంటే”, “కమ్‌బ్యాక్ అంటే ఇదే”, “రుక్మిణి వసంత్ తిరిగి తన రేంజ్ చూపిస్తోంది” అంటూ అభిమానులు ఆమెను ప్రశంసల వర్షంలో ముంచుతున్నారు. ఒకప్పుడు నెగిటివ్ టాక్ ఎదుర్కొన్న హీరోయిన్ ఇప్పుడు వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకోవడం నిజంగా ఇన్‌స్పిరేషన్‌గా మారిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి, రష్మిక మందన్నకు సంబంధించిన వార్తలు, రుక్మిణి వసంతకు వచ్చిన కొత్త అవకాశాలు, శర్వానంద్ సినిమాతో వచ్చిన బిగ్ బ్రేక్—అన్ని కలిపి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తే, ఈ హీట్ ఇంకా ఏ స్థాయికి చేరుతుందో చూడాలి..!?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి