తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లో ఆఖరి చిత్రంగా వస్తున్న ‘ జన నాయగన్ ’ చుట్టూ ఇప్పుడు రీమేక్ వివాదం ముదురుతోంది. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ భగవంత్ కేసరి ’ కి ఫ్రీమేక్ లేదా కాపీ అని సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.


కాపీ ఆరోపణలు - నెటిజన్ల ట్రోలింగ్ :
ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు ‘భగవంత్ కేసరి’లోని సీన్లతో పోలుస్తూ మీమ్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలో ఒక అమ్మాయిని (శ్రీలీల) ఆర్మీలో చేర్పించే బాధ్యతను బాబాయ్ తీసుకుంటాడు. ‘జన నాయగన్’లో కూడా విజయ్ ఒక యువతికి అండగా నిలిచి, ఆమెను శక్తివంతురాలిగా తీర్చిదిద్దే క్రమంలో సాగే సీన్లు యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లు, విజయ్ బాడీ లాంగ్వేజ్ కూడా బాలయ్య మార్క్ ‘నేలకొండ భగవంత్ కేసరి’ మేనరిజమ్స్ ను గుర్తుకు తెస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ.


అధికారిక రీమేక్ హక్కులు ?
అయితే, ఇది కాపీ కాదు.. అధికారిక రీమేక్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు హెచ్. వినోద్, ‘భగవంత్ కేసరి’ కథలోని మూల పాయింట్ నచ్చి, దానికి అధికారిక హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ సినిమాలోని కీలక భావోద్వేగాలను ఇందులో వాడుకున్నారు. కేవలం రీమేక్ లా కాకుండా, విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్న తరుణంలో కథకు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ జోడించారు. బాలయ్య సినిమాలో వ్యక్తిగత గౌరవం, ఆడపిల్లల ఆత్మస్థైర్యం గురించి చర్చించగా, విజయ్ సినిమాలో వ్యవస్థను ఎదిరించే రాజకీయ కోణాన్ని హైలైట్ చేశారు.


తెలుగులో ఘనవిజయం సాధించిన కథను విజయ్ తన చివరి సినిమా కోసం ఎంచుకోవడంలో ఒక సేఫ్ గేమ్ ఆడుతున్న‌ట్టే అనిపిస్తోంది.  ఎమోషన్స్ పరంగా ‘భగవంత్ కేసరి’ ఇప్పటికే రుజువైంది. అదే ఎమోషన్‌ను విజయ్ వంటి స్టార్ హీరో తనదైన శైలిలో పండించగలిగితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం ఖాయం. అయితే, తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఒరిజినల్ సినిమా చూసి ఉండటం వల్ల, డబ్బింగ్ వెర్షన్ (జన నాయకుడు) ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.


విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ముందు చేస్తున్న ఈ చిత్రంలో ‘భగవంత్ కేసరి’ ఛాయలు ఉండటం వాస్తవమే అయినా, దానిని తమిళ నేటివిటీకి మరియు విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హెచ్. వినోద్ ఎలా మార్చారు అనేదే సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: