వినుత భర్త చంద్రబాబు ఆ వీడియోలో.. స్థానిక టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చెన్నై పోలీసులు సైతం రిమాండ్ రిపోర్టుని అధికారికంగా బయట పెట్టకముందే , ఆ వివరాలన్నీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కి ఎలా తెలిసాయి అంటూ ప్రశ్నించారు?. అలాగే తమను అరెస్టు చేయడానికి ముందు శ్రీకాళహస్తి సిఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చకముందే అది హత్యో, ఆత్మహత్యో తేలకముందే తమ పైన ఎన్నో ఆరోపణలు చేయడం వెనుక ఎమ్మెల్యే కుట్ర ఉందని వినుత భర్త చంద్రబాబు ఆరోపించారు.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమ రాజకీయ ప్రత్యర్థుల ఎదుగుదలను అసలు ఓర్చుకోలేరని విమర్శలు చేశారు. చెన్నైలో తమ వ్యాపార పలుకుబడిలను ఉపయోగించి తమపైన ఇలాంటి కక్ష సాధింపులు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. హత్య జరిగిన సమయంలో తామ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమ సొంత మామ గారి చికిత్స జరుగుతుంటే అక్కడ ఉన్నామని అందుకు సంబంధించి సీసీ కెమెరాలు లో చూసుకోవచ్చు అంటూ స్పష్టం చేశారు. కానీ తాము రిమాండ్ కు వెళ్లాక ముందే ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి మరి, డ్రైవర్ రాయుడు తమ తమ్ముడు లాంటివాడు అంటూ చెప్పడం వంటిది ముందస్తు ప్రణాళికనే అంటూ విమర్శించారు. ఈ కేసులో నిజానిజాలు బయటపడాలి అంటే.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకించి (SIT) అధికారులతో సిబిఐ విచారణ జరిపించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర కూడా ఉందని ప్రజలకు తెలుసు అయినా కూడా అధికారులు ఎందుకు విచారణ చేపట్టడం లేదంటూ కోట దంపతులు నిలదీశారు. ఉన్నత స్థాయిలో విచారణ జరపడం వల్ల న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి