ఈ నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియా వర్గాల్లో “తారక్‌ను ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారు” అన్న తరహా వార్తలు కూడా వినిపించాయి. ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో అదిరిపోయే ఆఫర్లు వేసుకున్నాడని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇది విని ఎరుగని స్థాయి ఆఫర్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుత సినిమా పూర్తయ్యిన వెంటనే ఎన్టీఆర్‌తో ఒక భారీ బిగ్ ప్రాజెక్ట్‌ను ఓకే చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా ‘అనిమల్ పార్క్’ షూటింగ్ పూర్తైన తర్వాత స్టార్ట్ చేయాలనే విధంగా ప్లానింగ్ జరుగుతోందట. ఒకవేళ అన్నీ అనుకున్న టైమ్‌కే జరిగితే, ఖచ్చితంగా తారక్ కెరీర్ మరో స్థాయికి వెళ్లడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తూ, “త్రివిక్రమ్ సినిమా పోయినా, దానికి బదులుగా అమ్మ మొగుడు లాంటి పవర్‌ఫుల్ సినిమాను పట్టేశాడు ఎన్టీఆర్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తారక్ నటించబోయే సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతోందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో పోస్టులు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ మొత్తం సోషల్ మీడియాలో భారీ హీట్ క్రియేట్ చేస్తూ, రోజురోజుకీ కొత్త కొత్త ఊహాగానాలకు దారి తీస్తోంది. అధికారిక ప్రకటనలు లేకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన స్ట్రాటజీతో మళ్లీ ఇండస్ట్రీలో తన స్థాయిని మరింత బలంగా చాటబోతున్నాడన్న భావన అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి