రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'రౌడీ జనార్దన' (Rowdy Janardhana). ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర వర్గాల నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. .


దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో సుమారు రెండు వారాల పాటు నాన్-స్టాప్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేస్తున్నారు. సినిమాలో ఇదే మేజర్ హైలైట్‌గా ఉండబోతోందని, విజయ్ దేవరకొండ ఇందులో మునుపెన్నడూ చూడని "ఫుల్ యాక్షన్ మోడ్" లో కనిపిస్తారని తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో విజయ్ లుంగీ కట్టుకుని, చేతిలో కత్తి పట్టుకుని రక్తంతో తడిసిన దేహంతో కనిపించి పూనకాలు తెప్పించారు. ఇంటర్వెల్ సీన్ అంతకంటే వైల్డ్‌గా ఉండబోతోందట ..



ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ఎలిమెంట్ సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar).మునుపెన్నడూ చూడని లుక్: రాజశేఖర్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, ఆయన పాత్ర సినిమా గమనాన్ని మారుస్తుందని సమాచారం. 1980ల నాటి తూర్పు గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది."కన్నీళ్లను నెత్తురుగా ఒంటికి పూసుకున్నోడు.. సావు కళ్లముందుకొచ్చి నిలబడితే.." అనే డైలాగ్‌తో ఈ సినిమా ఇప్పటికే అంచనాలను ఆకాశానికి చేర్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న 59వ చిత్రం కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: