యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే వచ్చే జోష్ వేరే, అంతగా ప్రేక్షకుల మనసుల్ని తన నటనతో ఆకట్టుకున్నాడు తారక్. తాను ప్రతి పాత్రకి 100 శాతం ఇచ్చి అభిమానుల అంచనాలను రీచ్ అవ్వడానికి ఏమాత్రం వెనకాడడు ఈ కుర్ర హీరో.  మరోవైపు అంతే పేరు ప్రఖ్యాతలు కలిగిన డైరెక్టర్ కొరటాల శివ. ఈయన ప్రతిభకు తోడుగా సక్సెస్ ఎప్పుడూ తన  వెన్నంటే వుంటుంది. అనుకున్న కథను స్క్రీన్ పై చూపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో దిట్ట.  ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో మరోసారి సినిమా రాబోతుందని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం విన్న ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవదులు లేవు. ఎప్పుడెప్పుడు వీరి  సినిమా గురించి అప్డేట్ వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
 
టైటిల్ ఏంటి ? హీరోయిన్ ఎవరు ? పాత్రధారులు ఎవరు అన్న విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి అన్న పాత్ర  ఉందనుందని తెలుస్తోంది . ఈ పాత్ర కథకి చాలా కీలకమని సమాచారం . కాగా ఎన్టీఆర్ అన్న పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపెంద్రను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక  హీరోయిన్ విషయానికొస్తే ఫ్రెష్ ఫేస్ ను పరిచయం చేస్తే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నట్లు సమాచారం. మరి వీటి గురించి ఓ క్లారిటీ రావాలంటే అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
 ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ సినిమా అంతకు   మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఎప్పుడూ ఏదో ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ తో అలరించే కొరటాల ఈ చిత్రంతో ఎలాంటి మెసేజ్ తో రాబోతున్నారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో, దర్శకుడు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాల తర్వాత వీరి కాంబో తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: