సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ నటించిన సినిమాలు దాదాపు అన్ని హిట్లే అనే చెప్పాలి. ఇక సామ్ కెరీర్ మొదట్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు ఏ రేంజ్ లో చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అవసరం లేకపోయినా ఏదో గ్లామర్ రోల్ కోసం అన్నట్లుగా సమంత కనిపించేది.ఇక అప్పట్లో అలాంటి గ్లామర్ పాత్రలను చెయవద్దని సమంతకు చాలా రిక్వెస్టులు వచ్చాయి.సమంత కూడా మెల్లగా ఆ ఫార్మాట్ నుంచి బయటపడుతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలిగా మారిందో అప్పటి నుంచి కూడా సామ్ వేస్తున్న అడుగులు ఊహించని రేంజ్ లో ఉంటున్నాయి.


ఇక ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అందులో సమంత నటించిన రాజీ అనే బోల్డ్ పాత్ర అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.ఇక దెబ్బకి సమంత పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుంది. తన పాత్రతో నార్త్ ఇండియా ఆడియన్స్ ని కూడా దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సామ్ కు స్టార్ హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. దీంతో మరో ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కూడా సమంత కోసం ఒక వెబ్ కంటెంట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. సమంత ఓకే అంటే చాలాట ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఒక్కసారి ఫిక్స్ అయితే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కంటెంట్ బావుంది అంటే ఆ రోల్ కు సెట్టయ్యే యాక్టర్స్ కోసం ఎంత ఖర్చయినా చేయ్యడానికి రెడీ అవుతారు. ఇక మన సామ్ పై కూడా వారు గట్టి నమ్మకంతో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: