1990 లో ఎ మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం కర్తవ్యం. విజయశాంతి వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఓ నిజాయితీగల పోలీస్ అధికారిణి అంగ బలం, అర్ద బలం కలిగిన అవినీతిపరులను రౌడీలను ఎలా ఎదుర్కున్నది అన్నది ఈ చిత్ర కథాంశం. వైజయంతి గా విజయశాంతి కనబరిచిన నటనకు హీరోలు సైతం ముగ్ధులయ్యారు. అప్పట్నుంచే ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ప్రారంభించింది విజయశాంతి.
హీరోలకు సమానంగా తన మార్కెట్ ను ఈ సినిమాతో పెంచుకుంది విజయశాంతి. ఏమైనా పోలీస్ నేపథ్యమున్న సినిమాలలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు రాగా కర్తవ్యం ఆ సినిమాలలో ముందువరుసలో ఉంటుంది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ఈ తరహా సినిమాలు విజయశాంతి చాలా చేయగా వాటన్నిటి కంటే ఎక్కువగా కర్తవ్యం సినిమా ద్వారానే ఆమెకు మంచి పేరు వచ్చింది. దాదాపు 90 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఏకంగా 7 కోట్ల కలెక్షన్లను సాధించింది. విజయశాంతి ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. తమిళ, హిందీ భాషల్లో కి కూడా డబ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.