ప్ర‌స్తుతం యూట్యూబ్ ట్రెండ్ న‌డుస్తోంది. అయితే శృతి అనే అమ్మాయి  అమెరికాలో సెటిల్ అయింది. శృతి తీసే వీడియోలు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు త‌గ్గ‌ట్టు ఆక‌ట్టుకునేలా ఉంటాయి.  ఆమె బీటెక్‌ చదివి, తర్వాత అంద‌రిలాగే పెళ్లి చేసుకుని త‌న భర్తతో క‌లిసి అమెరికాలో సెటిల్ అయింది. ఇక ఆమె అమెరికాలో ఇంజినీర్‌గా జాబ్ చేస్తూనే టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా అక్క‌డ జ‌రిగుతున్న ఫ్యాషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వీడియోలను తీసి వాటిని త‌న అఫీషియ‌ల్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్టు చేసేది.

దీంతో ఆ వీడియోలకు ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో ఏకంగా త‌న ఐటీ జాబ్‌ను ను కూడా వదిలేసి వీడియోల వేట‌లో ప‌డింది. ఇక అప్ప‌టి నుంచి త‌న‌కున్న ట్యాలెంట్‌తో పూర్తిగా యూట్యూబ్‌ వీడియోలను తీస్తూ ఫుల్ పాపులర్ అయింది. క్రియేటివ్‌ కంటెంట్ తో పాటు కామెడీ వీడియోలు అలాగే ఫ్యాషన్ కు సంబంధించిన ప్రోగ్రామ్‌లు చేస్తూ చాలా రకాల ఛానళ్లు నడుపుతోంది శృథి. ప్ర‌స్తుతం ఆమె సోషల్‌ స్టార్ గా అవ‌త‌రించింది.

శృతి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 1985లో పుట్టింది. తన అన్నయ్య అంకూర్‌ ఆనంద్‌తో క‌లిసి చిన్న‌త‌న‌మంతా అక్కడే గ‌డిపింది. బుందేల్‌ఖండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఇన్ స్టిట్యూట్ోల బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌సైన్స్‌లో బీటెక్ కంప్లీట్ చేసింది శృతి. ఇక దాంతో పాటే 2009లో అర్జున్‌ సాహును పెండ్లి చేసుకుంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఇప్పుడు అమెరికాలోనే ఉంటుంది.

పెండ్లి అయిన త‌ర్వాత సరదాగా తన హెయిర్‌స్టైల్స్ సెట్ చేసుకుంటూ వాటికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసేది. వాటికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో చాలా రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ చేయడమే రోజూ పనిగా పెట్టుకునేది శృతి. ఇక అమెరికాలో టెక్నికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న టైమ్‌లోనే గుర్‌గావ్‌లో స్టీరియా ఇండియా జాబ్ వ‌చ్చింది. దీంతో ఇండియాకు వ‌చ్చేసి ఉద్యోగంలో చేరింది శృతి. ప్ర‌స్తుతం ఉద్యోగం మానేసి యూట్యూబ్ వీడియోల‌నే తీస్తూ ఉంది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: