మురళీమోహన్ ఎంత గొప్ప నటుడో మనకి బాగా తెలుసు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మచ్చలేని మనిషిగా గుర్తింపు ఉన్న హీరో అని చెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి ఆయన ఎంతలా బాధ పడ్డారంటే రాజకీయాల్లోకి వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఎంతగానో బాధ పడ్డారు.


" నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా చంద్రబాబు గారు నన్ను కన్విన్స్ చేసి మరీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.. నేను పదేళ్ల రాజకీయంలో ఉన్నందువలన చాలా కోల్పోయాను. అంతేకాకుండా రాజకీయాలంటే విరక్తి వచ్చింది అని"  తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు."నేను రాజమండ్రి ఎంపీ గా ఉన్నప్పుడు.. ప్రతిపక్షం వాళ్ళు నన్ను గోదావరిలోని ఇసుక  మొత్తాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించానని అన్నారు. కానీ  నా గృహానికి కావాల్సిన ఇసుకను కూడా బయట అమ్మే వ్యక్తులతో నేను నా సొంత డబ్బుతో తీసుకున్నానని తెలిపారు."

మురళి మోహన్ గారు సినిమాలో నటిస్తున్నప్పుడే.. తను మందు తాగకూడదు అని అనుకున్నారట. వీటితో పాటే లవ్ ఎఫైర్, కార్డ్స్ వంటివి కూడా తన జీవితంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారు. కానీ  నాగేశ్వరరావు గారు మాత్రం నరాలు యాక్టివ్ గా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి 2 ఫారెన్ పెగ్గులు వేస్తే సరిపోతుందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు మురళీమోహన్.



2009 లో టీడీపీ తరఫున నుంచి రాజమండ్రి లో ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఓడిపోయానని తెలిపారు. ఆ తరువాత 2014 లో మళ్లీ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక రాజకీయ పార్టీల మీద విరక్తితో 2019 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి వైదొలిగారు. అంతేకాకుండా తను రాజకీయాలకు గుడ్ బై తెలిపారని కూడా చెప్పారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నట్లు స్పష్టం చేశారు మురళీమోహన్.


మరింత సమాచారం తెలుసుకోండి: