
రామ్ పోతినేని తన తదుపరి సినిమా గా లింగుస్వామి తో ఓ మాస్ మసాలా యాక్షన్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడైతే ప్రకటించబడింది అప్పటినుంచి తెలియని ఆనందం ఉంది రామ్ అభిమానులలో. ఎందుకంటే అప్పటి వరకు రామ్ ఒకేరకం సినిమాలలో నటిస్తూ రాగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫలితం తేలిపోతుండగా ఇప్పుడు అది కూడా సక్సెస్ రేటు బాగా ఉన్నా దర్శకుడితో చేతులు కలపడం వారికి ఎంత గానో ఖుషి చేస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కొంత ఫామ్ లోకి వచ్చిన ఆయన చేసిన తదుపరి సినిమా రెడ్ తో మళ్ళీ డీలా పడిపోయాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నా కలెక్షన్ల పరంగా నిర్మాతకు భారీ నష్టాలను తీసుకొచ్చిన సినిమా. దాంతో ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని తమిళనాడులో మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన లింగుస్వామి తో సినిమాను ఒకే చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ నేరేషన్ పూర్తయిన సందర్భంగా ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది అని అర్థం వచ్చేలా ట్వీట్ కూడా చేశారు.
ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తుండగా అదే నిజమనీ ఇప్పుడు తెలుస్తుంది. నిజానికి రామ్ తన కెరీర్ లో పోలీస్ గా కనిపించడం ఇదే తొలిసారి. అందుకే బాగా ఎగ్జైట్ అవుతున్నాడు అంటున్నారు. ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలు, మినిమం మాస్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చాడు. పోలీస్ పాత్ర అంటే వేరే లెవెల్ మాస్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తన పాత్రను ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఇప్పుడున్న ఫిజిక్ ఇంకాస్త పెంచాలి. రెడ్ కోసం రామ్ కాస్త లావు అయ్యారు. ఇప్పుడు లింగుస్వామి కోసం కూడా మరికొంత లావు అయ్యి స్టైల్, లుక్ మార్చాలి.