
వెండి తెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా సినిమాలు హిట్ అవ్వడం ఇప్పుడు ఎంతో ప్రెస్టీజియస్ గా మారిపోయింది. వెండితెర పై సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు బుల్లితెరపై భారీ టీఆర్పీ రేటింగ్ లు తెచ్చుకోవాలని హీరోల ఫ్యాన్స్ వేడుకుంటూ ఉంటారు. చిత్రంగా వెండితెర మీద పైన ఫ్లాప్ అయిన చాలా సినిమాలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. బుల్లి తెరపై వచ్చిన ప్రతిసారీ టాప్ టిఆర్పి రేటింగ్ లను అందిస్తుంది. ఆ విధంగా టాప్ టీ ఆర్ పీ రేటింగ్స్ ను పొందిన టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా 19.5 టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా అటువంటి వెండి తెరపైన ఇటు బుల్లితెర పైన సూపర్ హిట్ గా నిలిచింది. సీనియర్ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం నుంచి వచ్చిన టిఆర్పి రేటింగ్ 20.21. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జనతా గ్యారేజ్ 20.69 టిఆర్పి రేటింగ్ లతో బుల్లితెర పైన హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ నటించిన సెన్సేషనల్ చిత్రం గీతగోవిందం టిఆర్పి రేటింగ్ 20.8.
వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమా టిఆర్పి రేటింగ్ 21.31. దేశం గర్వించదగ్గ సినిమా అయినా బహుబలి కి వచ్చిన టిఆర్పి రేటింగ్ 21.54. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 21.7. శ్రీమంతుడు సినిమా కి 22.5, బాహుబలి రెండో భాగానికి 22.7, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 23.4 టిఆర్పి రేటింగులు దక్కించుకున్నాయి. ఈ విధంగా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న సినిమా గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మొదటి స్థానంలో నిలిచింది.