జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఈ షో ద్వారా చాలా మంది తమ జీవితాలలో నిలదొక్కుకున్నారు అంటే ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు కోవచ్చు.  దాదాపు అందరు కమెడియన్ లు డబ్బులు సంపాదించి ఇల్లు కూడా కట్టుకుని సెట్ అయిపోయారు. మిగితా అందరు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ షో ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుందో కనీ ఈ షో వల్ల ప్రేక్షకులు కూడా ఎంతో ఉపసమానాన్ని పొందుతున్నారు.  ఆ విధంగా జబర్దస్త్ లో లేడీ గెటప్ లతో ప్రేక్షకులను అలరించిన జబర్దస్త్ వినోద్ అలియాస్ వినోదిని తాజాగా ఆయన కు పెళ్లైన విషయాన్ని, తన భార్య గురించి విశేషాలు అని చెప్పారు.

చీర కట్టే మేకప్ వేస్తే అచ్చం అమ్మాయిల చాలా అందంగా కనిపిస్తాడు వినోద్. గతంలో ఎన్నో వివాదాలలో చిక్కుకున్న వినోద్ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఇప్పుడు ఈ రేంజ్ కి వచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వినోద్ వినోదం పేరుతో కొత్త ఛానల్ ప్రారంభించాడు. అందులో మొదటి వీడియో తన పెళ్లి గురించి తీశారు పెళ్లి వివరాలు చెప్పడం తో పాటు భార్యను కూడా అందరికీ పరిచయం చేశాడు.

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పెళ్లిళ్లు నిరాడంబరంగా జరిగాయి. జబర్దస్త్ వినోద్ పెళ్లి కూడా అలాగే జరిగిపోయింది. తన మేనత్త కూతురు విజయలక్ష్మిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె స్వస్థలం కడప. జబర్దస్త్ లేడీ గెటప్ వేసే ఆర్టిస్టులపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అవన్నీ నిజం కాదన్నారు. వినోద్ లాంటి లేడీ గెటప్ లు వేసే వారి పెళ్ళిళ్ళు జరుగుతాయా అని చాలా మంది విమర్శించారు.  ఇంటర్వ్యూలో కూడా అడిగేవారు అని గుర్తు చేశారు ఇప్పుడు వారికీ సమాధానం వచ్చిందని చెప్పారు. మరి భవిష్యత్తులో జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసే ఆర్టిస్టుల పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: