సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ లు వస్తే దర్శకులను ఏ హీరో పట్టించుకోడు. హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేయడానికి ఎవరైనా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అదే ఫ్లాప్ లో ఉన్న దర్శకులను చూద్దాంలే అన్నట్టు గా వ్యవహరిస్తారు. ఆ విధంగా టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులు వరుసగా ఫ్లాపులు వచ్చినా తర్వాత భారీ సాహసాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారెవరో కాదు నేను శైలజ సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో ఫ్లాప్ అందుకున్న కిషోర్ తిరుమల, తొలి ప్రేమతో హిట్ కొట్టి తర్వాత మిస్టర్ మజ్ను,  ఇటీవలే విడుదలైన రంగ్ దే వంటి సినిమాలతో ఫ్లాప్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. 

వీరిద్దరూ ప్రస్తుతం తమ తదుపరి సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకీ అట్లూరి కి కర్ణన్ సినిమా రీమేక్ దక్కినట్లు సమాచారం. ఇందులో వెంకటేష్ కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గాని హీరోగా నటించే అవకాశం ఉంది.  అంతేకాకుండా తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ తో ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట వెంకీ అట్లూరి. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా వస్తుందో చూడాలి. ధనుష్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తుండగా ఇప్పుడు వెంకీ అట్లూరి తో రెండో పాన్ ఇండియా సినిమా చేస్తుండడం విశేషం. 

ఇక కిషోర్ తిరుమల విషయానికి వస్తే.. రెడ్ సినిమా ప్లాపు తర్వాత కొంచెం స్లో అయినట్లు కనిపించాడు. కిషోర్ తిరుమల ప్రస్తుతం హీరో శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం పూర్తయ్యే లోపు మరో ప్రాజెక్టును కూడా సెట్ చేసుకున్నాడట. యువ సామ్రాట్ నాగార్జున తో చర్చలు జరిపారని సమాచారం. కథ తన పాత్ర నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతే కాదు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే వీరి కాంబో తెరపైకి రానుంది. మరి ఈ ఇద్దరు దర్శకుల గత సినిమాలు ఫ్లాప్ అవడంతో స్టార్ డైరెక్టర్ అయ్యే సూచనలు కనిపిస్తున్న వీరు భవిష్యత్తులో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: