విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ చేసిన ఈ సినిమా కెరీర్ తొలినాళ్లలోనే ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. నిజానికి కెరీర్ మొదట్లోనే సీఎంగా చేసే పాత్ర దొరకడం ఒక హీరోకి దగ్గర ఉంటే అదృష్టమనే చెప్పాలి. అందులోనూ విజయదేవరకొండ లాంటి యంగ్ హీరో ఈ విధమైన పాత్ర చేయడం ఆయన కెరియర్ కు ఎంతో ప్రెస్ అయింది..

అప్పటికే గీతగోవిందం వంటి క్లాసిక్ హిట్ తో విజయ్ దేవరకొండ ఈ తరహా సినిమాను ఎంచుకోవడం సెన్సేషనల్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా తమిళంలో కూడా అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ అక్కడ కి గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లు అయింది. 2018 లో విడుదలైన ఈ సినిమా ఆనంద శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా మెహరిన్ హీరోయిన్ గా నటించింది. మారి నిర్మాణసంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా మా ప్రేక్షకులను మెప్పించి కమర్షియల్ గా కొంత వెనుకబడింది. 

అయినా కూడా విజయ్ దేవరకొండ తన నటనతో ఈ సినిమాను ప్రేక్షకులను ఏవిధంగా చేశాడు. లండన్ లో గేమ్ డెవలపర్ గా ఉన్న హీరో తన తండ్రి అవినీతి కేసులో అరెస్టు కావడంతో అనుకోకుండా ఓనమాలు  తెలియకుండా సీఎం పదవి చేపట్టాల్సి వస్తుంది. ఆ తరువాత జరిగిన ఈ పరిణామాల దృష్ట్యా హీరో తన తండ్రిని ఎదిరించే పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు తన కొడుకును పదవినుంచి దింపడానికి తండ్రి ప్రయత్నిస్తాడు. ఇలాంటి ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ పరం గా ఎంతగానో ఆకట్టుకుంది. సత్యరాజ్,  నాజర్ లు ఈ సినిమాకు ఆయువుపట్టు కాగా విజయ్ దేవరకొండ న్యూ లుక్ లో డిఫరెంట్ జోనర్ లో చూడాలనుకునే వారికి ఈ సినిమా సరిగ్గా యాప్ట్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: