ఇటీవల ఎన్టీఆర్, రాంచరణ్ ల పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు క్రియేట్ చేసాయి. ఒలీవియా, మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కానుంది. అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క మేకింగ్ వీడియో ని ఈ నెల 15న విడుదల చేయనున్నాం అంటూ మొన్న ఆర్ఆర్ఆర్ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ మేకింగ్ వీడియో విషయమై పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మేకింగ్ వీడియోలో వచ్చే బీజీఎమ్ అలానే కొన్ని యాక్షన్ సీన్స్ తాలూకు సన్నివేశాలు అదిరిపోతాయట, అలానే ఈ సినిమాలోని రెయిన్ ఫైట్, రెండు సాంగ్స్ కి సంబదించిన విజువల్స్ కూడా ఈ వీడియోలో పొందుపరిచారట. మొత్తంగా మరొక మూడు రోజుల్లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత భారీగా అంచనాలు పెంచడం ఖాయం అంటున్నారు...... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి