
ప్రస్తుతం టాలీవుడ్ కి దేశ సినిమా మార్కెట్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఇక్కడ నటిస్తే పాన్ ఇండియా స్టార్ అయిపోవచ్చు అని ఆలోచిస్తున్నారు. తెలుగు లో సినిమాలు చేసిన టాలీవుడ్ హీరో లు సూపర్ హిట్ సాధించి దేశం మొత్తం పాపులారిటీ అందుకున్న నేపథ్యంలో కొంతమంది ఇతర భాషల హీరోలు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఎంతో ఆశ పడుతున్నారు. ఆ విధంగానే ఇన్నిరోజులు డబ్బింగ్ సినిమాలతో మాత్రమే అలరించిన తమిళ హీరోలు ఇప్పుడు డైరెక్ట్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడులో స్టార్ హీరోలుగా ఉన్న విజయ్ దళపతి, ధనుష్, సూర్య వంటి హీరోలు తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే విజయ్ దళపతి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించబోతున్నారు. మరికొంతమంది తమిళ హీరోలు కూడా తెలుగులో నటించి తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారట. వారిలో యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఉన్నారు.
తమిళంలో వరుసగా సూపర్ హిట్లు సాధించి కాబోయే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన శివ కార్తికేయన్ ఆ తర్వాత సినిమాల్లో నటించి వరుసగా తొమ్మిది సినిమాలు హిట్లు కొట్టి ఆ తర్వాత స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యే విధంగా ప్రణాళికలు వేయగా అందులో భాగంగా తెలుగులో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకోసం ఓ నిర్మాత కూడా ఇప్పటికే భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్టార్ డైరెక్టర్ ఎంపిక చేస్తారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా కొన్ని రోజులలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.