ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరో ఒకరి పట్ల విడదీయలేని అనుంబంధం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఆ వ్యక్తి పట్ల మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వారితో ఉన్న సంబంధం గురించి మాటల్లో చెప్పలేని ప్రేమ ఉంటుంది. మనం ఎవరిని అన్నా ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తికి మన మనసులో గుడి కట్టి మరి ఒక దేవుడిలా, దేవతలాగా ఆరాధిస్తూ ఉంటాము కదా. అయితే తన జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారని మన బబ్లీ బ్యూటీ హన్సిక చెబుతుంది. మరి ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా.. తన మనసుకు అంతలాగా దగ్గర అయిన వ్యక్తి గురించి స్వయంగా హన్సికనే సోషల్ మీడియా వేదిక ద్వారా తన అభిమానులతో చెప్పారు . హన్సిక అభిమానించే వ్యక్తి ఆమె తల్లే అని చెబుతోంది.


ఈ 
రోజు అంటే ఈ శుక్రవారం హన్సిక తల్లి అయిన మోనా మాత్వాని పుట్టిన రోజు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌  అయ్యారు. తన  తల్లి మోనా యంగ్‌ ఏజ్‌లో ఉన్న కొన్ని ఫొటోలతో పాటు, హన్సిక తన తల్లితో గడిపిన ఆ మధుర క్షణాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. అలాగే ఆ ఫొటోలతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ.. నువ్వు నాకు ఎంత ముఖ్యమో నేను మాటల్లో చెప్పలేను. నువ్వే మా ప్రపంచం, మాకు ఇంత మంచి భవిష్యత్తును ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అమ్మ అంటూ హన్సిక  ఎమోషనల్‌ అయ్యారు.

 
ఇకపోతే హన్సిక తల్లి మోనా విషయానికి వస్తే ఆమె ఒక స్కిన్ స్పెషలిస్ట్. హన్సిక చిన్నవయసులోనే  ఆమె తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ భారం మొత్తం హన్సిక తల్లి అయిన మోనానే మీద పడింది. పిల్లలు ఇద్దరిని ఆమె పెంచి పోషించి ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చారు. హన్సికకు ఒక సోదరుడు ఉన్నారు. హన్సిక చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అనంతరం   అతి తక్కువ వయసులోనే ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్‌ గా అవతారం ఎత్తి ప్రేక్షకుల ఆదరణ పొందారు.తరువాత తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: