
అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసే ఛాన్స్ కొట్టిన అనిల్, గత ఏడాది ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ తీస్తున్నారు అనిల్ రావిపూడి. కాగా ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ హీరోలుగా నటిస్తుండగా దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇక దీని తరువాత బాలయ్య తో అనిల్ తన నెక్స్ట్ మూవీ, అలానే పై మరొకసారి సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ సినిమాలు చేయనున్నట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అనిల్ రెండు రోజుల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అక్కడి స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తదుపరి బాలయ్య గారితో మూవీ ఉంటుందని, అయితే మహేష్ గారు రాజమౌళి తో చేయనున్న మూవీ అనంతరమే తన సినిమా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. కాగా అనిల్ మాట్లాడిన ఈ వీడియో బైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..... !!