రాజమౌళి సినీమ అంటే ఆ ప్రమోషన్స్ స్పెషల్ గా ఉంటాయి. ఓ విధంగా రాజమౌళి సినిమా ఎంత గొప్పగా తీస్తాడో అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తాడు. పోస్టర్ దగ్గర నుండి సినిమా రిలీజ్ ఇంటర్వ్యూస్ వరకు రాజమౌళి ప్రమోషనల్ స్కెచ్ అదిరిపోతుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా ఇదే పంథా కొనసాగించాలని చూస్తున్నాడు మన జక్కన్న. బాహుబలి తర్వాత వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే.

ఆర్.ఆర్.ఆర్ కోసం ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్న వార్తల గురించి తెలిసిందే. తన సినిమాలో నటించిన నటీనటులు, కాస్ట్ అండ్ క్రూతో ఓ ప్రమోషనల్ సాంగ్ చేయడం రాజమౌళికి అలవాటే.. కాని ఆర్.ఆర్.ఆర్ కోసం కొత్తగా తను పనిచేసిన హీరోలందరిని ఈ ప్రమోషనల్ సాంగ్ లో పాల్గొనేలా చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ సాంగ్ కోసం బాహుబలి ప్రభాస్ ను దించుతున్నారట జక్కన్న. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ముగ్గురు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనబడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

జక్కన్న వేసిన ఈ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. కేవలం మెగా నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆర్.ఆర్.ఆర్ మీద అంచనాలు పెంచుకునేలా చేస్తున్నాడు. బాహుబలిని మించే సినిమాగా ట్రిపుల్ ఆర్ కావాలంటే ఇలాంటి ప్లాన్లు వేయాల్సిందే. మరి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 1920 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మెగా నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని పుష్కలంగా పెట్టాడట రాజమౌళి. సినిమాలో అల్లూరి పాత్రలో చరణ్.. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ ఒకరిని మించి ఒకరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: