సౌత్ సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ప్రేక్షకులపై ఎంతటి ముద్ర వేశారో వారి వారి సినిమాలను బట్టి ప్రేక్షకుల రెస్పాన్స్ ను బట్టి తెలుస్తుంది. దేశంలోనే సౌత్ సినిమా కి ఉన్న క్రేజ్ దేనికి లేదు. ఇటీవల కాలంలో ఉత్తరాదిన సైతం సౌత్ సినిమాల జోరు మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద బడ్జెట్లతో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు సాధ్యం కాని రీతిలో సినిమాలను తెరకెక్కించి సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదలై గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ప్రపంచవ్యాప్త కీర్తిని అందుకుంటుంది. అంతే కాదు కొన్ని సౌత్ సినిమాలను కూడా ఉత్తరాదిన రీమేక్ చేసి హిట్ లు కొట్టి సౌత్ సినిమా యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారు.

ఆ విధంగా సౌత్ సినిమా పరిశ్రమలోని హీరో సూర్య తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పుడు సౌత్ లోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో లో శివ కుమార్ అనే నటుడి పెద్ద కుమారుడైన సూర్య 1997లో నేరుక్కు నేర్ అనే తమిళ సినిమాతో ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. సూపర్ హిట్ సినిమాలు చేసి తమిళం లో క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరో అయినా సూర్య ఆ తర్వాత తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తూ ఇక్కడ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. 

మొదటి నుంచి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న ఆయన గజిని అనే సినిమా ద్వారా తెలుగులోకి మొదట గా ప్రవేశించి ఆ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అలా గజిని, సింగం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉంటుందో సూర్య సినిమాకి కూడా అలాంటి హడావుడి కనబడడం మనం చూస్తుంటాం. ఓ వైపు హీరోగా మరోవైపు సినిమా నిర్మాణ బాధ్యతలు పోషిస్తూ సూర్య రోజు రోజుకి ఎదుగుతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఇక ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన లుక్ విడుదలైంది. సూర్య 40 వ చిత్రం గా రాబోతున్న ఈ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది.  ఈ సినిమా లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: