భారతీయుడు
సినిమా కి గాను
లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలతో
శంకర్ కు
సినిమా నిర్మాణ విషయంలో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వీరి వివాదం ముదిరి ముదిరి కోర్టుకు చేరగా ఇటీవలే కోర్టు నుంచి
శంకర్ కు తదుపరి
సినిమా లు చేయొచ్చు అనే ఊరట కూడా వచ్చింది. దాంతోనే
శంకర్ ఈ
సినిమా పనులు ప్రారంభించడం మొదలుపెట్టాడు.
తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేసి ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెట్టాడు. తాజాగా ఈ
సినిమా కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే
రామ్ చరణ్ తో
సినిమా అనౌన్స్ చేసినప్పుడు
శంకర్ ఈ చిత్రాన్ని దాదాపు ఐదారు భాషలలో విడుదల చేస్తానని చెప్పాడు.
దాంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనంద పడ్డారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో వచ్చే చిత్రం కావడంతో ఈ మాత్రం భారీగా విడుదల కావాల్సి ఉంది అని అనుకున్నారు. అందులోనూ
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాబోతున్న
సినిమా కాబట్టి అప్పటికే
రామ్ చరణ్ కు మంచి ఇమేజ్ ఉంటుంది సో ఆ తర్వాత వచ్చే ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల అయితే మంచిది అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ
సినిమా మూడు భాషలలో మాత్రమే చేస్తారట శంకర్. అంటే
రామ్ చరణ్ ఇప్పుడు చేసే సినిమాను తెలుగు తమిళ
హిందీ భాషల్లో మాత్రమే రూపొందిస్తున్నారాన్న మాట. పరిస్థితిని బట్టి వీలైనన్ని ఎక్కువ భాషల్లో చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా
రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.