దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు చేయడానికి ముందు కొన్ని సీరియల్స్ చేయడం జరిగింది. ఈటీవీ లో ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ లో పని చెయ్యడం జరిగింది. రాజమౌళి దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యడం జరిగింది. రాఘవేంద్రరావు వద్ద సినిమా గురించి చాలా నేర్చుకున్నాడు. సినిమాలో ఒక సీన్ ఎంత కీలకమో ఆ సీన్ అంత పర్ఫెక్ట్ గా రావడం కూడా అంతే ముఖ్యం అని నేర్చుకున్నాడు. రాఘవేంద్రరావు రాజమౌళిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఎన్టీఆర్ సినిమాకు డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడు. ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి అయిన ఆ సినిమాకు కావాల్సినవి అన్ని దగ్గరుండి చూసుకుంటూ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. ఆ తరువాత వరుస విజయాలు అందుకుంటూ రాజమౌళి అగ్ర దర్శకుల స్థాయిలో నిలిచాడు.

ఇదిలా ఉండగ రాజమౌళి తన సినిమాలో ప్రతి సీన్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు కంప్రమైజ్ కాదట. ఆ సీన్ కరెక్ట్ గా వచ్చేంత వరకు ఎన్ని గంటలు అయిన సరే షూటింగ్ చేసేవాడట. ఇది చూసి ఆయనకు జక్కన్న అని పేరు రాజీవ్ కనకాల పెట్టాడట. ఆ పేరు ఎందుకు పెట్టాడో రాజీవ్ వివరించాడు. రాజమౌళి ఒక సీన్ చెప్పగానే ఆ సీన్ త్వరగా పూర్తి అవుతుందిలే అనుకునేవాదట రాజీవ్. కానీ ఆ సీన్ కరెక్ట్ గా వచ్చేంత వరకు అమరశిల్పి జక్కన్నలాగా చెక్కుతూనే ఉండేవాదట. రాజమౌళి ఒక పని రాక్షసుడు అని అనుకున్న పూర్తి అయ్యేవరకు నిద్రపోడు అవతలి వారిని నిద్రపోనివ్వడు అని తెలిపాడు.రాజీవ్ పెట్టిన పేరు చాలా పాపులర్ అయింది. రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలవడం మొదలు పెట్టారు. రాజమౌళి, రాజీవ్ మంచి స్నేహితులు. రాజమౌళి సీరియల్స్ చేస్తున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే రాజమౌళి తన సినిమాలలో రాజీవ్ కు మంచి పాత్రలు ఇచ్చేవాడు. రాజీవ్ రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్1 సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా తరువాత సై, యమదొంగ,విక్రమార్కుడు వంటి సినిమాలలో మంచి పాత్రలు చేసాడు. ప్రస్తుతం రాజీవ్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన నారప్ప సినిమాలో మంచి పాత్రను పోషించాడు. ఈ సినిమా కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్  అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: