టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది ఎంతటి ధైర్యసాహసాలకు ఒడిగడతారు అంటే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటూ అందరిలో టెన్సన్స్ తెప్పిస్తూ ఉంటారు. కానీ ఈ తరహా ధైర్యసాహసాలు ప్రదర్శించే విధంగా మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ప్రేక్షకులను అలరింపచేయడం కోసం కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సినిమాలను షూటింగ్ లో పాల్గొంటారు మన హీరోలు. 

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ను చూపిస్తూ వారికి సినిమా అంటే ఎంత అంకిత భావం ఉందో ఇలాంటి చర్యల ద్వారా అప్పుడప్పుడు బయటకి తెలుస్తుంది అలా సూపర్ స్టార్ కృష్ణ నిజమైన బాంబు ప్రమాదంలో గాయపడ్డారు. జేమ్స్ బాండ్, గూఢ చారీ వంటి మూవీస్ కి తెలుగులో శ్రీకారం చుట్టి ఎన్నో సాహస దృశ్యాల్లో కనిపించారు  సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఆయన ఈ సినిమా ల షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగలేదు కానీ సిరిపురం మొనగాడు సినిమా లో జరిగిన ప్రమాద ఘటన కృష్ణ ఎప్పటికీ మరిచిపోలేనిది గా ఉంటుంది.

కేఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన సిరిపురం మొనగాడు సినిమా లో త్రిపాత్రాభినయం లో కృష్ణ నటించగా జయప్రద, కె.ఆర్.విజయ హీరోయిన్స్ గా నటించారు. శ్రీకాంత్ నహత నిర్మించిన ఈ చిత్రంలోనీ ఓ యాక్షన్ సీన్ లో ఐదుగురు ఫైటర్స్ గుర్రాలు నాలుగైదు ఫిరంగులు ఉన్నాయి. అయితే ఫిరంగులు వెలిగిస్తే వెలుగుతుంది. దొంగలు వస్తుంటే ఎదుర్కొనే సీన్ అది.  అయితే ఆ సమయంలో ఫిరంగి వెలిగిస్తే బాంబు పేలకడంతో మళ్ళీ కొంత మందు ట్రై చేశారు. చివరికి సుత్తివేలు కాగడాలతో వెలిగించే సరికి ఒక్కసారిగా బాంబు పెలి అది రివర్స్ లో కృష్ణ వైపు దూసుకురావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: