తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కరోనా లేకపోయుంటే ఈ పాటికే కొత్త సీజన్ స్టార్ట్ అయి ఉండేది.ఇక ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే ఐదవ సీజన్ ని ప్రారంభించుకోనుంది.ఇక గత ఏడాదిలానే ఈ సారి కూడా కాస్త ఆలస్యంగానే ఈ షో మొదలు కానుంది.ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా రెడీ అయిపోయారు.ఆ లిస్ట్ ను బిగ్ బాస్ టీమ్ ప్రస్తుతానికైతే చాలా సీక్రెట్ గా ఉంచింది. కానీ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నా..అవి ఎంతవరకు నిజమో తెలియదు.

ఈ షో ప్రీమియర్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ లిస్ట్ ని సీక్రెట్ గా ఉంచాలని భావిస్తోంది బిగ్ బాస్ టీమ్.ఇక తాజా సమాచారం ప్రకారం ఐదవ సీజన్ ని హోస్ట్ చేయబోయేది కూడా మన కింగ్ నాగార్జున గారే.ఈ సీజన్ కి కూడా చివరికి నాగార్జుననే ఫైనల్ చేసిందట టీమ్.ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లను ఆయనే హోస్ట్ చేసి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ ని అందించారు.దాంతో సీజన్ 5 ను కూడా ఆయన తోనే హోస్ట్ చేయించాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు.అయితే నిజానికి ఐదవ సీజన్ ని హోస్ట్ చేయడానికి ముందుగా నాగార్జున అంతగా ఆసక్తి చూపలేదు.దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు మరి కొంతమంది హీరోలను సంప్రదించారు.

న్యాచురల్ స్టార్ నాని తో పాటూ దగ్గుబాటి రానా ని సైతం సంప్రదించారు. కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ నాగ్ నే ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించారట.ఇక సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది.ఇక ఒకవైపు తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూనే వీకెండ్స్ లో బిగ్ బాస్ 5 షూటింగ్ కి హాజరు కానున్నారట నాగార్జున.ఇక ప్రస్తుతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు సినిమాతో పాటూ గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇక బంగార్రాజు షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: