ప్రతి హీరోకి విజయాలు అపజయాలు రావడమనేది చాలా సర్వసాధారణం. విజయం వచ్చినప్పుడు పొంగి పోకుండా అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సదరు హీరో ఎప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా మధ్యలోనే తన కెరియర్ను ముగించుకొని పోవాల్సి వస్తుంది.  ఆ విధంగా టాలీవుడ్ లోనే కాకుండా దేశం మెచ్చే స్టార్ హీరో  గా ఎదిగిన ప్రభాస్ మొదట్లో ఎన్నో అపజయాలను ఎదురుచూశాడు. ఎంతో నమ్మకం పెట్టుకొని చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద దారుణమైన నిరాశ మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి యోగి.

వివి వినాయక్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద చతికిల పడిపోయింది. అమ్మ సెంటిమెంట్ మెయిన్ హైలెట్ గా నిలుస్తూ రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక భారీ ఫ్లాప్ గా ప్రభాస్ కు మిగిలిపోయింది. అయితే ఈ సినిమా రీమేక్ సినిమా అని చాలా తక్కువ మందికి తెలుసు. కన్నడ జోగి సినిమాను తెలుగులో ప్రభాస్ రీమేక్ చేయగా 2007 సంక్రాంతికి విడుదల అయింది. వివి వినాయక్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 అయితే అక్కడ ఆడిన ఈ సినిమా ఇక్కడ ఎందుకు ఆడలేదు అనేది పరిశీలిస్తే.. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ లో శారద ను తీసుకోవడం డైరెక్టర్ చేసిన పెద్ద తప్పు అని విశ్లేషకులు తెలిపారు. అప్పటికే శారదా బామ్మ రోల్స్ చేస్తుంటే ప్రభాస్ తల్లిగా ఆమె ను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అది ఒక తప్పు అయితే మరొకటి నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం. ఈ సినిమాలో ఆలీ సునీల్ వేణుమాధవ్ కామెడీ పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. అందుకే ఈ సినిమా బయ్యర్లను నిలువునా ముంచింది. ఆ తరువాత తన తప్పులు తెలుసుకొని ప్రభాస్ మంచి సినిమా కథలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: