టాలీవుడ్ లో ఇద్దరు హీరోల మధ్య పోటీ నెలకొనడం ఎంతో సహజం. ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు ఒకే సమయానికి పూర్తి కావడం ఒకే సమయానికి రిలీజ్ కావడం సర్వ సాధారణంగా జరిగే విషయమే. ఆ విధంగా వచ్చే సినిమాలు మంచి క్రేజ్ తో పాటు ఎంతో ఆసక్తిని కనబరుస్తాయి.  అందులోనూ ఒకే కుటుంబం లోనీ ఇద్దరు హీరోల మధ్య పోటీ అంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విధంగా టాలీవుడ్ లో నందమూరి వంశానికి చెందిన ఇద్దరు టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ లు ఒకే టైం లో తమ సినిమాలను విడుదల చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో గాని వీలైతే అక్టోబర్ లో కానీ విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. అయితే అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. భారీ తారాగణంతో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల అవుతుందని గతంలోనే నిర్ణయించారు.

అయితే నందమూరి.బాలకృష్ణ.సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడగా ఆ సినిమా అక్టోబర్ నాటికి మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బాబాయ్ అబ్బాయ్ ల మధ్య పోటీ తప్పకుండా ఏర్పడుతుందని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల తన చేతుల్లో లేని నేపథ్యంలో ఎన్టీఆర్ తప్పకుండా బాబాయ్ ని ఎదుర్కోక తప్పదు. బాలకృష్ణ కూడా తన సినిమాను ఆ టైం లోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో తన సినిమాను ఆపలేడు బాలకృష్ణ. దాంతో వీరిద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీపడక తప్పదు అనిపిస్తుంది. నందమూరి అభిమానులకు ఇది ఒకింత నిరాశ పరచే విషయమే అయినా ఈ రెండు సినిమాలు హిట్ కావాలని భారీ కలెక్షన్స్ సాధించాలని వారు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: