టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే సంగీత దర్శకుడు దేవిశ్రీపసాద్. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. సంగీత లోకంలో విహరింప చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాక్ స్టార్ గా ఎదిగిన దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో సైతం పాటలు సమకూర్చి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ సంగీత దర్శకుడు.

చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం సమకూర్చే దేవి శ్రీ బర్త్ డే నేడు.  ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసే ఆయన బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి తనయుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన దేవిశ్రీ ప్రసాద్ చిన్న తనం నుంచి సంగీతం అంటే ఎంతో ఆసక్తి చూపించేవాడు. అప్పట్నుంచే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ఆరో తరగతిలోనే ఏమవుతావని అడిగితే సంగీత దర్శకుడిని అవుతానని చెప్పాడట.

ఆయనకు సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన దేవిశ్రీ తల్లి ప్రముఖ భారతీయ మాండలిన్ నిపుణుడు మాండలిన్ శ్రీనివాస్ దగ్గర చేర్పించారు. దాదాపు 13 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని 19 ఏళ్ల ప్రాయంలోనే టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా మారిపోయాడు. అలా ఆయన చేసిన తొలి సినిమా  దేవి మంచి విజయం సాధించడమే కాకుండా పాటలకు దేవిశ్రీ కి మంచి పేరు రావడం తో మ్యూజిక్ డైరెక్టర్ గా నిలదొక్కు కున్నాడు. ప్రస్తుతం మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు దేవిశ్రీప్రసాద్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ దేవిశ్రీ సంగీతం తప్పకుండా ఉండాల్సిందే. ఆయన పాటలు ఎన్నో అవార్డులు సైతం తెచ్చి పెట్టాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేయడమే కాదు పాడడంలో కూడా డాన్స్ లు వేయడం లో కూడా ఘనాపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: