ప్రస్తుతం సౌత్ నుంచి తెరకెక్కిస్తున్న సినిమాలలో పాన్ ఇండియా సినిమాలు రావడం రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పెద్ద హీరోలు చేసే అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. తమిళ భాష నుంచి నుంచి మలయాళ భాష నుంచి కన్నడ నుంచి కూడా కొన్ని చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. అలా బాహుబలి సినిమా ఈ ట్రెండ్ నీ మొదలు పెట్టిన తర్వాత అన్ని సినిమా పరిశ్రమలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి. 

బాహుబలి సినిమా తర్వాత అంతటి రేంజ్ లో తెరకెక్కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటించగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ రెండవ భాగం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటుందో ననీ దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ పరిశ్రమకు సంబంధించి మరొక పాన్ ఇండియా సినిమా రెడీ అవుతోంది.

జోగి, రాజ్ ద షో మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దర్శకుడు ప్రేమ్ మంచి సినిమా లు చేసి హిట్ లు సాధించగా గాయకుడుగా, గీత రచయితగా ప్రేమ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ఓ భారీ చిత్రం రాబోతుంది. పి9 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. విభిన్న కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే ప్రేమ ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాను రూపొందించడం విశేషం. ఇది దక్షిణాదిన ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గ
మారింది. అలాగే కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: